ఘోరం.. భార్యాభర్తలు ఆత్మహత్య
VSP: విశాఖ ఉత్తర నియోజకవర్గం శంగం ఆఫీసు వద్ద ఆదివారం రాత్రి భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది స్థానికంగా సంచలనం రేపుతోంది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆత్మహత్య చేసుకున్న వివాహిత ఏడు నెలల గర్భిణీ అని సమాచారం. విషయం తెలుసుకున్న బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.