డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు

డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు

కృష్ణా: గుడివాడ టూ టౌన్ పరిధిలోని పెద్ద కాలవ సెంటర్ వద్ద సీఐ హనీష్ కుమార్ గురువారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారుల పత్రాలను పరిశీలించిన ఆయన, అక్రమ మద్యం, మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.