ఈ నెల 25 నుంచి భావనారాయణస్వామి వార్షికోత్సవం
KKD: జిల్లా కేంద్రం శివారు సర్పవరంలోని రాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి వార్షిక కల్యాణోత్సంవం ఈ నెల 25 నుంచి మే 3వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలన్నారు. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను పోలీసులు, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.