'నందిని సిద్ధారెడ్డికి అవార్డు సాహిత్యానికి దక్కిన గౌరవం'

'నందిని సిద్ధారెడ్డికి అవార్డు సాహిత్యానికి దక్కిన గౌరవం'

SDPT: ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డికి తన కవితా సంకలనం 'అనిమేష'కు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడంపై మంజీరా రచయితల సంఘం (మరసం) హర్షం వ్యక్తం చేసింది. మంగళవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ గొంతుకగా, సాహిత్య శిఖరంగా సిద్ధారెడ్డికి ఈ గౌరవం దక్కడం జిల్లాకే గర్వకారణమని కొనియాడారు.