సీపీఐ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి
జనగామ జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం అంబేడ్కర్ జయంతిని నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సీహెచ్.రాజారెడ్డి, పార్టీ శ్రేణులు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిసాయన్న, సుగుణమ్మ, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.