మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యం

మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యం

SKLM: మహిళలు టైలరింగ్ నేర్చుకోవడం వలన స్వయం ఉపాధి పొందేందుకు దోహదపడుతుందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. బుధవారం పలాస వెలుగు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ శిక్షణ మహిళలకు జీవనోపాధి కలిగిస్తుందన్నారు. దీనిని సద్వినియోగపర్చుకోవాలని సూచించారు.