నల్గొండ జిల్లా యంత్రాంగానికి అరుదైన గౌరవం
NLG: ప్రాంతీయ అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధారిత పరిష్కారాల్లో చురుకుగా ఉన్న నల్గొండ జిల్లా యంత్రాంగానికి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం డిసెంబరులో ఢిల్లీలో జరగనున్న ‘S&T క్లస్టర్స్: మేకింగ్ లైవ్స్ ఈజియర్’ అంతర్జాతీయ సదస్సుకు జిల్లా కలెక్టర్‌ను ఆహ్వానించింది.