ముగింపు దశకు చేరిన మొదటి విడత ఎన్నికల ప్రచారం
పెద్దపల్లి జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంథని, కమాన్పూర్, రామగిరి, శ్రీరాంపూర్, ముత్తారం మండలాల్లో 99 సర్పంచ్, 896 వార్డు మెంబర్ల ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తోంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఓట్ల కోసం నాయకులు ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. పలుచోట్ల అభ్యర్థులు సోషల్ మీడియా బృందాలను ఏర్పాటు చేసుకున్నారు.