ఈదురు గాలులకు నేల రాలిన మామిడికాయలు
SRCL: ఎల్లారెడ్డిపేట (M) గుండారం తిమ్మాపురం గ్రామాల్లో కురిసిన భారీ వడగళ్ల వానకుఈదురు గాలులకు మామిడి కాయలు నేల రాలాయి. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన భీమన్న అనే రైతు ముదిరాజు సంఘానికి చెందిన మామిడి తోటను రూ. 5 లక్షలకు తీసుకున్నాడు. దీంతో తీవ్రంగా నష్టపోయానని భీమన్న ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పించాలని ఆయన కలెక్టరుకు విజ్ఞప్తి చేశారు.