గొల్లప్రోలులో ఘనంగా బోనాల పండుగ

KKD: గొల్లప్రోలు గ్రామదేవత పాదాంబిక అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు. ఆషాడ మాసం బహుళదశమి సందర్భంగా వేలాది మహిళలు అమ్మవారికి సమర్పించే బోనాలు ఎత్తుకుని గ్రామోత్సవం నిర్వహించి తిరిగి అమ్మవారికి సమర్పించారు. గ్రామోత్సవంలో కోలాటాలు భజనలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.