VIDEO: రాజధాని అమరావతికి నిధులు ఇవ్వని ప్రధాని మోడీ: సీపీఐ

ప్రకాశం: రాజధాని అమరావతికి రెండుసార్లు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ప్రధాని మోడీ రాజధాని నిర్మాణానికి పైసా నిధులు ఇవ్వలేదని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ విమర్శించారు. శనివారం కనిగిరిలో ఆయన మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణానికి అప్పుగా మాత్రమే కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. పోలవరం, అమరావతి తప్పితే రాష్ట్ర అభివృద్ధి ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు.