VIDEO: వామ్మో కోతులు... సమస్య పరిష్కరించండి సారూ.!
WGL: నగరంలో కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా ఇండ్ల మధ్యలో సంచరిస్తూ.. తమను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. కరీంబాద్ శాంతినగర్లో పరిస్థితి ఇది. ఇటీవల కాలంలో తమ ప్రాంతంలో కోతుల స్వైర విహారం పెరిగిపోయిందని, ఇంట్లో వస్తువులు ఎత్తుకెళ్తూ తమను ఇబ్బంది పెడుతున్నాయని వాపోతున్నారు. కోతుల సమస్య తీర్చాలని కోరుతున్నారు.