అర్జీలకు నూరు శాతం పరిష్కారం చూపాలి: కలెక్టర్

కోనసీమ: ప్రజల నుంచి అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కార మార్గాలు నూరు శాతం చూపాలని కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారుల నుంచి ఆయన 135 అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి, డీఆర్వో కె. మాధవిలు పాల్గొన్నారు.