ఘనంగా బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ జయంతి వేడుకలు

ఘనంగా బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ జయంతి వేడుకలు

NTR: స్వాతంత్య్ర సమరయోధులైన లోకమాన్య బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్‌ల జయంతిని గొల్లపూడిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వర రావు పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి, వారి త్యాగాలను స్మరించుకున్నారు. వీరిద్దరూ భారత స్వాతంత్య్ర పోరాటంలో చిరస్థాయిగా నిలిచే సేవలు అందించారన్నారు.