ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

BHPL: పట్టణ కేంద్రంలోని కమలాపూర్ బొగ్గుల వాగు సమీపంలో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. CI నరేష్ కుమార్ వివరాల ప్రకారం.. గడ్డిగానిపల్లెకు చెందిన కొండగుర్ల రాజేందర్ (30) నాగారంలో పొలం పనులు ముగించుకుని బైకుపై ఇంటికి వస్తుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.