ఐరోపా కోరుకుంటే యుద్ధానికి సై: పుతిన్‌

ఐరోపా కోరుకుంటే యుద్ధానికి సై: పుతిన్‌

ఐరోపా ఖండం యుద్ధం కోరుకుంటే తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో వివాదంపై ఒక అంగీకారం కుదరకుండా ఐరోపా నేతలు అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం అంతానికి చర్చలు జరిపేందుకు అమెరికా రాయబారి స్టీవ్‌, ట్రంప్‌ అల్లుడు జేర్డ్‌ మాస్కోకు వచ్చి సమావేశం కావడంతో పుతిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.