వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది: మంత్రి అనిత

AP: వైసీపీ అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. మెడికల్ కాలేజీలను PPP మోడల్‌లో నిర్మించాలని నిర్ణయించామని, తమది జగన్ ప్రైవేట్ మోడల్ కాదు, పీపీపీ మాత్రమే అన్నారు. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో పీపీపీ అమలవుతోందన్నారు. పునాదులు వేసి మెడికల్ కాలేజీలు కట్టామంటే ఎలా? మదనపల్లె, ఆదోని సహా చాలా కాలేజీలకు పిల్లర్లు కూడా వేయలేదన్నారు.