VIDEO: మేనిఫెస్టోలోని ప్రతి హామీని అమలు చేస్తా: నూతన ఛైర్‌పర్సన్
SRPT మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతానని నూతన ఛైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత స్పష్టం చేశారు. తన గెలుపుకు సహకరించిన 46 వార్డుల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మేనిఫెస్టోలోని ప్రతి హామీని అమలు చేస్తామని, రోడ్లు, ఆస్పత్రులు, క్రీడా ప్రాంగణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగాపని చేస్తామని అన్నారు.