VIDEO: తుఫాన్ నేపథ్యంలో రైతులు ఆందోళన
కృష్ణా: దిత్వా తుఫాన్ నేపథ్యంలో మచిలీపట్నంలో రైతులు ఆదివారం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3.70 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 60% కోతలు పూర్తయ్యాయని, పంట చేతికొచ్చే సమయంలో వర్షాల భయం, అధిక కోత ఖర్చులతో ఇబ్బంది పడుతున్నామని రైతులు వాపోయారు. ఎకరాకు రూ.15,000 నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.