VIDEO: పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థులు

SKLM: లావేరు మండలంలోని తామాడ ఆదర్శ పాఠశాలకు విద్యార్థులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. సోమవారం ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశానికి పరీక్ష జరగనుంది. ఈ మేరకు తల్లిదండ్రులు విద్యార్థులకు పరీక్షా కేంద్రానికి తీసుకువస్తున్నారు. ప్రిన్సిపల్ డానియల్ నేతృత్వంలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.