అమెరికా F-35 యుద్ధ విమానం ధ్వంసం
పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా F-35 యుద్ధవిమానం ఒకటి దెబ్బతిని, అత్యవసరంగా ల్యాండ్ కావడం చర్చనీయాంశంగా మారింది. తమ గగనతల రక్షణ వ్యవస్థల సాయంతో ఆ జెట్‌ను ఢీ కొట్టామని ఇరాన్ చెబుతోంది. అమెరికా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే F-35 యుద్ధవిమానం పోరాటంలో శత్రు దాడికి గురికావడం ఇదే మొదటిసారి.