యూరియా కోసం రైతుల పడిగాపులు
GDWL: జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతి నగర్ సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా ఎరువు బస్తా కోసం రైతులు మంగళవారం, 09.12.2025న ఉదయం 6 గంటల నుంచి పడిగాపులు కాస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులందరికీ యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.