VIDEO: జగ్గంపేటలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం
E.G: జగ్గంపేటలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని దళిత నాయకుల సమక్షంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దాడి బాబురావు, పద్మావతి పాల్గొని దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వాన్ని తెలియజేస్తూ రచించిన గ్రంథమే భారత రాజ్యాంగ గ్రంథమని తెలిపారు. అందుకే ప్రతి ఏటా నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం జరుగుతుందన్నారు.