చెట్లకు రాఖీలు కట్టిన విద్యార్థులు

NLR: అనంతసాగరం మండలం చిలకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు గురువారం గ్రామస్తులకు, చెట్లకు వినూత్నంగా రాఖీలు కట్టి పరిరక్షించాలని సందేశమిచ్చారు. జీవన గమనంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని పాఠశాల HM ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.