'గిరిజన విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి'

'గిరిజన విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి'

ASR: రాజవొమ్మంగి(మం) గిరిజన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఏకలవ్య పాఠశాలను సందర్శించిన ఆయన, మారేడుమిల్లికి చెందిన ఐఏఎస్ విజేతను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యార్థుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.