కోటకొండ జామా మసీదులో బాల్య వివాహ అవగాహన
NRPT: కోటకొండ జామా మసీదులో ఓ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోషల్ మొబిలైజర్ రమేశ్ నేతృత్వంలో ఈ సదస్సులో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మసీదు సదర్ మైనుద్దీన్ బాల్య వివాహాలు సమాజానికి హానికరమని.. వాటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.