చెరువులను తలపిస్తున్న రోడ్డు

శ్రీకాకుళం: సరుబుజ్జిలిలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని స్థానికులు తెలిపారు. పోలీస్ స్టేషన్ నుంచి అమృతలింగానగరం వరకు రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, వర్షం పడితే వీటిలో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయన్నారు. గుంతల రోడ్డులో ప్రయాణం నరక ప్రాయంగా ఉందని వాహనదారులు వాపోయారు. అధికారులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు.