'ప్రాథమిక స్థాయిలోనే విద్య పట్ల ఆసక్తిని పెంచాలి'

SKLM: ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు విద్య పట్ల శ్రద్ధ కలిగే దిశగా కృషి చేయాలని ఎంఈవో బమ్మిడి మాధవరావు తెలిపారు. జలుమూరు మండలం హుస్సేన్ పురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. విద్యార్థులతో కలిసి వారి బోధన ఏ విధంగా కొనసాగుతుందో అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక స్థాయిలోనే విద్య పట్ల ఆసక్తి పెంచాలన్నారు.