సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై
KMM: సైబర్ నేరాల పట్ల విద్యార్థులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్ తెలిపారు. గురువారం తిరుమలాయపాలెం మండలం సుబ్లేడులోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఎస్సై సూచించారు.