పోలీస్ స్టేషన్‌లో ఒక్కటైనా ప్రేమ జంట
BDK: ప్రేమకు మాటలు అక్కర్లేదని నిరూపిస్తూ బూర్గంపాడు పోలీస్ స్టేషన్ వేదికగా మూగ, చెవిటి వైకల్యంతో బాధపడుతున్న ఓ జంట ఒక్కటైనట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి కోసం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా, పోలీసులు ఇరు కుటుంబాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఒప్పించారు. చివరకు పోలీసుల సమక్షంలోనే ఆ జంట దండలు మార్చుకుంది.