108ను తనిఖీ చేసిన ఆరోగ్యశ్రీ డీసీ

108ను తనిఖీ చేసిన ఆరోగ్యశ్రీ డీసీ

SKLM: ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నడపబడుతున్న 108 అంబులెన్స్‌ల పనితీరును ఆరోగ్య శ్రీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ప్రకాష్ శనివారం టెక్కలిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా 108 వెహికల్‌లో ఉన్న పరికరాలు, మందులు, రికార్డులను పరిశీలించారు. ముఖ్యంగా కాలం చెల్లిన మందులు అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.