దివ్యాంగుల హక్కులపై డీఈఎఫ్ సమావేశం
ATP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివ్యాంగుల సాధికారక ఫోరం (DEF) శాఖ వారు ఆదివారం అనంతపురం ఆర్ & బీ అతిథి గృహంలో సమావేశం నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల కార్పొరేషన్ ఛైర్మన్ గడుపూటి నారాయణస్వామితో దివ్యాంగుల హక్కులు, సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా DEF రాష్ట్ర నాయకులు ఛైర్మన్‌ను సన్మానించారు.