నేడు మొయినాబాద్‌కు డిప్యూటీ సీఎం రాక

నేడు మొయినాబాద్‌కు డిప్యూటీ సీఎం రాక

RR: మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ముర్తుజాగూడలో నూతనంగా ఏర్పాటు చేయనున్న 33/11కేవీ విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరవుతున్నట్లు ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని, అనంతరం లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.