ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
W.G: అత్తిలి మండలం పాలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. రైతులకు కనీస మద్దతు ధరతో పాటు సకాలంలో చెల్లింపులు అందచేయటానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ధాన్యాన్ని విక్రయించుకోవటానికి ఈ కేంద్రాన్ని వినియోగించుకోవాలన్నారు.