కుంకుడు ఆకుపై నవయుగ కవి గుర్రం జాషువా చిత్రం

NLR: నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా కుంకుడు చెట్టు ఆకుపై ఆయన చిత్రాన్ని విశ్రాంత డ్రాయింగ్ మాస్టర్ పచ్చ పెంచలయ్య గీశారు. పొదలకూరు మండలం మహమ్మదాపురానికి చెందిన ఆయనకు పలు ముఖ్యమైన సందర్భాలలో ఆయా సందర్భ చిత్రాలను వివిధ రకాల ఆకులపై గీసే అలవాటు ఉంది. గురువారం జాషువా వర్ధంతి సందర్భంగా కుంకుడు ఆకుపై చిత్రాన్ని గీసి అబ్బురపరిచారు.