రేపు టేకులపల్లి మండలంలో ఎమ్మెల్యే పర్యటన

BDK: టేకులపల్లి మండలంలో రేపు కోరం కనకయ్య పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇంఛార్జ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం 10:30 ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు గ్రామంలో పర్యటిస్తారని, అనంతరం 11 గంటలకు రాంపురం గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం, 12 గంటలకు పెట్రాంచెలకలో బీటి రోడ్డు, 12:30 కిష్టారంలో నూతన బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.