తాండూరు నూతన సీఐగా పరమేశ్వర్
VKB: తాండూరు పట్టణ నూతన సీఐగా పరమేశ్వర్ గురువారం రాత్రి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. మట్కా, గుట్కా, పేకాట, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తేలేదని పేర్కొన్నారు. అనంతరం స్టేషన్ సిబ్బంది ఆయనను అభినందించారు.