స్టాపర్లను ధ్వంసం చేసిన వ్యక్తికి జైలు శిక్ష
VZM: గంట్యాడ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రమాదల నియంత్రణకు ఏర్పాటు చేసిన స్టాపర్లను ధ్వంసం చేసిన నిందితుడికి 6 నెలలు జైలు శిక్ష విధించినట్లు జిల్లా మెజిస్ట్రేట్ పీ. బుజ్జి తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. భీమిలి మండలం జీ.తాళ్ళవలస గ్రామానికి చెందిన కే.వి. హేమంత్ కుమార్ 2022లో తన వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి స్టాపర్లు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.