శేరిలింగంపల్లిలో CMRF చెక్కుల పంపిణీ!
RR: శేరిలింగంపల్లిలో పలు డివిజన్లకు చెందిన బాధితులకు మంజూరైన రూ. 19,58,000 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను జగదీశ్వర్ గౌడ్ స్వయంగా అందజేశారు. ఈ సహాయం కేవలం ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా, కష్టకాలంలో ప్రభుత్వం ప్రజలకు తోడుగా ఉంటుందనే నమ్మకాన్ని, భరోసాను కల్పిస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ప్రజల బాధే తమ బాధగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.