VIDEO: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
MDK: నార్సింగి 44వ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వల్లభాపూర్ గ్రామ శివారులో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలు వల్లబపూర్ గ్రామానికి చెందిన ముత్త బాలమణిగా గుర్తించారు. ఆమె కుమారుడు రాములకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.