గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి మృతి

NZB: నగరంలోని న్యూ బ్రిడ్జి వద్ద వాగులో సుమారు 28-38 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమైంది. మృతుడు బ్రౌన్ రంగు టీ షర్ట్, ఎరుపు బనియన్, జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు. అతని కుడి చేతిపై 'మీనాక్షి' అని ఇంగ్లీష్‌లో పచ్చబొట్టు ఉంది. ఈ వ్యక్తికి సంబంధించిన సమాచారం తెలిసినవారు 4 టౌన్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని స్థానిక ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.