భీమేశ్వరాలయంలో మహా లింగార్చన

భీమేశ్వరాలయంలో మహా లింగార్చన

SRCL: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంతో పాటు భీమన్న ఆలయంలో కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా మహాలింగార్చన పూజ నిర్వహించారు. ఉదయం మహాన్యాస పూర్వక ఏకదశ రుద్రాభిషేక పూజ, రాత్రి మహాలింగార్చన పూజ ఘనంగా జరిగాయి. జ్యోతులను లింగాకారంలో వెలిగించి విశేష పూజలు చేశారు.