రూ. 9కోట్ల బడ్జెట్‌తో తీస్తే.. రూ. 50కోట్లు వచ్చాయి

రూ. 9కోట్ల బడ్జెట్‌తో తీస్తే.. రూ. 50కోట్లు వచ్చాయి

సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'తాయి కిళవి' మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం రూ. 9కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 51.16కోట్లు వసూలు చేసింది. 'పవునుత్తాయి' అనే మాస్ పాత్రలో రాధికా నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే ఊపు కొనసాగితే త్వరలోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం.