జిల్లా వ్యాప్తంగా సెలవులు ప్రకటించాలి: TGVP

ADB: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ కొట్టూరి ప్రవీణ్ కుమార్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కోరారు. పాఠశాలకు రాకపోకల సమయంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వర్షాలు తగ్గేవరకు సెలవులు ప్రకటించాలని కోరారు.