తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు షురూ
AP: తిరుపతి జిల్లాలోని తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం ధ్వజారోహణం జరగగా, రాత్రికి చిన్నశేష వాహన సేవ ఉంటుంది. 18న పెద్దశేష వాహనం, 19న ముత్యపు పందిరి వాహనం, 20న కల్పవృక్ష వాహనం, 21న పల్లకీ ఉత్సవం, 22న సర్వభూపాల వాహనం, రాత్రి గరుడ వాహనం, 23న సూర్యప్రభ వాహనం, 24న రథోత్సవం, 25న పంచతీర్థం, రాత్రి ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి.