'శతశాతం ఉత్తీర్ణత సాధించేలా బోధనపై దృష్టి సారించాలి'
ASR: 100రోజుల ప్రణాళిక పక్కాగా అమలు చేసి, 10వ తరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేలా బోధనపై దృష్టి సారించాలని కొయ్యూరు ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్ టీచర్లకు సూచించారు. సోమవారం డౌనూరు గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. ముందుగా వసతి గృహంలో వంటశాలను, భోజనశాలను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు.