నేడు డీసీసీబీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న కిమిడి నాగార్జున

నేడు డీసీసీబీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న కిమిడి నాగార్జున

VZM: డీసీసీబీ ఛైర్మన్‌గా నియమితులైన కిమిడి నాగార్జున ఆదివారం పదవి బాధ్యతలు చేపట్టనున్నట్లు డీసీసీబీ సీఈవో ఉమామహేశ్వరరావు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు పూల్ బాగ్ రోడ్‌లో ఉన్న జె-కన్వెన్షన్‌లో నిర్వహించే కార్యక్రమంలో పదవీ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు. మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, కింజరాపు అచ్చంనాయుడు పాల్గొంటారు.