సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ELR: సీఐటియూ జిల్లా 13వ మహాసభల సందర్భంగా ఆదివారం కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ నుంచి చిన్న గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ జరిగింది. సీఐటియూ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు ఉమామహేశ్వరరావు, జిల్లా నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.