పానీపూరి తిని కత్తితో దాడి
NZB: ఓ వ్యక్తి పానీపూరి తిని.. రూ.10 డబ్బులు అడిగిన సదరు చిరు వ్యాపారిపై కత్తితో దాడి చేసిన ఘటన నిజామాబాద్లో ఆదివారం రాత్రి జరిగింది. నగరంలోని శంకర్ భవన్ స్కూల్ వద్ద చిరువ్యాపారి ఆకాశ్ పానీపూరీబండి నడిపిస్తున్నారు. హర్మీత్ సింగ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చిఆకాశ్ వద్ద పానీపూరి తిన్నాడు. డబ్బులు అడగగా నన్నే అడుగుతావాఅంటూ హర్మీత్ సింగ్ చిన్నచాకుతో ఆకాశ్ వేళ్ళు కోశాడు.