రేపు శివపురంలో గంగమ్మ తిరునాళ్లు

KDP: మైదుకూరు మండల పరిధిలోని శివపురంలో రేపు గంగమ్మ తిరునాళ్ల మహోత్సవం నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ కొండా భాస్కర్ రెడ్డి తెలిపారు. మే 10, 11వ తేదీల్లో రెండు రోజులపాటు ఘనంగా అమ్మవారికి పూజలు జరుగుతాయన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు.